![]() |
![]() |
.webp)
కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షో గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ షో ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది. "మాష్టర్ ఫినాలేకి ప్రిపరేషన్ ఎలా ఉంది" అని శ్రీముఖి శేఖర్ మాష్టర్ ని అడిగింది. చూసావు కదా అంటూ అమరదీప్ గట్టిగా అరుస్తూ "1000 వాలా తెచ్చి స్టేజి మీద పెట్టి మాష్టర్ చెప్పండి వెలిగించేస్తాం" అన్నాడు మంచి జోష్ తో. "గెలిస్తే ఇవి అంటిస్తాం గెలవకపోతే సెట్ అంటించేస్తాం" అంటూ విన్నింగ్ కెప్టెన్ ఇమ్మానుయేల్ చెప్పుకొచ్చాడు. ఇక లేడీస్ సైడ్ నుంచి ప్రియాంక జైన్ వచ్చి కోసేయమంటారా అంటూ కేక్ ని చూపించి అడిగింది.
ఇక విష్ణు ప్రియా ఐతే పటాసులు తెచ్చి కాల్చేయమంటారా అంటూ అడిగింది. దాంతో అందరూ నవ్వేశారు. ఇక రోహిణి ఐతే రెండు దండాలు పట్టుకొచ్చింది. అవి చూసిన శ్రీముఖికి డౌట్ వచ్చి " ఒక దండ అంటే అనసూయ గారి మెడలో వేయడానికి తెచ్చావు ఓకే ఇంకో దండ ఎందుకు" అని అడిగింది. "యాజ్ ఏ విన్నింగ్ కెప్టెన్ గా నేను వేసుకోవడానికి" అని చెప్పింది. దాంతో అందరూ నవ్వేశారు. "యుద్ధంలో అందరూ పోరాడతారు. కానీ పోరాడేవాడి చేతిలో కత్తి మాత్రమే ఉంటుంది. కానీ గెలిచినోడికి మాత్రమే సింహాసనం దక్కుతుంది" అంటూ అనసూయ, శేఖర్ మాస్టర్ కలిసి టైటిల్ ని రివీల్ చేసి చూపించారు. కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 1 , 2 గ్రాండ్ సక్సెస్ ని సొంతం చేసుకున్నాయి. ఈ ఎపిసోడ్ మొత్తం కూడా బుల్లితెర మీద కనిపించేవాళ్లే ఉన్నారు. తేజస్విని మడివాడ, డెబ్జానీ, శ్రీసత్య, హమీద, రోహిణి, ప్రేరణ, ఇమ్మానుయేల్, అమరదీప్, ప్రియాంక జైన్, శివ్, సాకేత్, నిఖిల్, నిఖిల్ విజయేంద్ర సింహ, బంచిక్ బాబులు, సుష్మిత, పృద్వి శెట్టి, అంబటి అర్జున్, మానస్, విష్ణుప్రియ వంటి వాళ్లంతా ఎంటర్టైన్ చేశారు. ఐతే ఇప్పుడు ఈ ఫినాలేలో గర్ల్స్ గెలుస్తారా బాయ్స్ గెలుస్తారా అన్నది చూడాలి.
![]() |
![]() |